ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ తన గేమ్‌ను మాత్రమే కాదు, టోర్నీని కూడా మధ్యలోనే వదిలిపెట్టేందుకు గల కారణం జీన్స్ అంటే మీరు నమ్ముతారా..? అవును ఇదే నిజం.
డ్రెస్ కోడ్ బ్రేక్ చేసినందుకు జరిమానా
మాగ్నస్ కార్ల్‌సన్ జీన్స్ ధరించి గేమ్‌లో పాల్గొనడంతో FIDE అతనిపై 200 డాలర్ల జరిమానా విధించింది. ఈ చర్యకు డ్రెస్ కోడ్ ఉల్లంఘన కారణమని FIDE స్పష్టం చేసింది. దీంతో, 9వ రౌండ్‌లో పాల్గొనడానికి నిబంధనలు పాటించాల్సిందిగా సూచించింది. FIDE నిర్ణయంపై మాగ్నస్ కార్ల్‌సన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. “నా ఫ్యాన్స్‌కు ఇది నిరాశ కలిగించే విషయం.. క్షమించండి” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
అభిమానుల్లో విభిన్న స్పందనలు
మాగ్నస్ కార్ల్‌సన్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానుల మధ్య మిశ్రమ స్పందనలకు దారితీసింది. కొందరు డ్రెస్ కోడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలంటూ FIDE వైపు నిలబడుతుండగా, మరికొందరు మద్దతు తెలుపుతున్నారు.