‘ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా’.. బండారు సంచ‌ల‌నం

'ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా'.. బండారు సంచ‌ల‌నం

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మినీ మహానాడు (Mini Mahanadu) వేదికగా మాడుగుల ఎమ్మెల్యే(MLA) బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) రాష్ట్ర ప్రభుత్వంపై, మంత్రులపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. నిధుల కేటాయింపులో వివక్ష, అభివృద్ధి పనుల లోపం, చోడవరం-మాడుగుల (Chodavaram-Madugula) నియోజకవర్గాలపై అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా. ప్రజల్లో తిరగలేక, సమాధానం చెప్పలేకపోతున్నా” అని ఆయన మహానాడు వేదికపై ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో వైరల్‌గా మారాయి.

అన‌కాప‌ల్లి జిల్లా (Anakapalli District) మ‌హానాడు (Mahanadu) పాయ‌క‌రావుపేట‌ (Payakaraopeta)లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి జిల్లా మంత్రుల‌తో పాటు ఎమ్మెల్యే, ముఖ్య‌నేత‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బండారు సత్యనారాయణ మూర్తి ప్ర‌భుత్వంపై, మంత్రుల‌పై త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు 7-8 కోట్ల రూపాయలు కేటాయిస్తుండగా, మాడుగులకు కేవలం 2-3 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. “ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయాను. ప్లానింగ్ బోర్డు మీటింగ్‌లో నిధుల కోసం కోరినా, ఫలితం లేదు” అని ఆయన వాపోయారు.

మాడుగుల, చోడవరం నియోజకవర్గాల ప్రజలు టీడీపీ (TDP) కి 28 వేల మెజారిటీతో ఓటు వేసి గెలిపించినప్పటికీ, అభివృద్ధి నిధులలో అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. స్థానిక షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణకు నిధులు లేక మూతపడే ప్రమాదంలో ఉందని, మున్సిపాలిటీ లేకపోవడం, జీవీఎంసీ, సీఎస్ఆర్ నిధులు రాకపోవడం వంటి సమస్యలను కూడా ఆయన లేవనెత్తారు. “మూడేళ్ల పాటు నిధులు ఇవ్వమని చెప్పేయండి. నేను ప్రజల కాళ్లలో పడి క్షమాపణ చెప్పుకుంటాను” అని ఆయన ఆవేదన వ్య‌క్తం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

బండారు వ్యాఖ్య‌లు టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. బండారు సత్యనారాయణ మూర్తి తన సొంత పార్టీ నాయకత్వంపైనే, మంత్రుల స‌మ‌క్షంలోనే ప్రశ్నలు సంధించ‌డం సంచ‌ల‌నంగా మారింది. బండారు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల‌కు నిధుల కేటాయింపుల్లోనూ వివ‌క్ష కొన‌సాగుతోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment