మెగా డాటర్ నిహారిక (Niharika Konidela) కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘మద్రాస్ కారణ్’ (MadrasKaaran) ఇప్పుడు తెలుగు వర్షన్‌తో ఓటీటీ (OTT) ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తమిళంలో ఈ చిత్రం జనవరి 10న థియేటర్లలో విడుదలై, నెల తిరిగేలోపే ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. తాజాగా, తెలుగు ప్రేక్షకుల కోసం ‘ఆహా’ వేదికగా (Aha Streaming) ఫిబ్రవరి 26న స్ట్రీమింగ్కు రానుంది.
తక్కువ బడ్జెట్ – భారీ నష్టాలు
వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి. జగదీష్ నిర్మించారు. సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో కోటి రూపాయల కలెక్షన్లు కూడా సాధించకుండా భారీ నష్టాలను మూటగట్టుకుంది. తమిళ్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన రాగా, అదే సమయంలో విశాల్ ‘మదగజరాజ’ మంచి టాక్ తెచ్చుకోవడంతో ‘మద్రాస్ కారణ్’కు ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోయింది. మరి ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందగలదా.. అనేది వేచి చూడాలి.








