“కాకి రెట్టకు కూడా పనికిరారు” పురుషుల‌పై నటి సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

టాలీవుడ్ నటి మాధవీలత (Madhavi Latha) మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశారు. సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్ష, పురుషాధిక్య ధోరణిపై (Male Dominance) తరచూ స్పందించే ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఆమె విడుదల చేసిన వీడియోలో మగాళ్ల మనస్తత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మహిళలపై వివక్షపై ఆగ్రహం
పండుగలు, వేడుకలు ముగిసిన తర్వాత మళ్లీ సాధారణ రోజులు మొదలయ్యాయని చెబుతూ మాధవీలత తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘అన్నీ అయిపోయాయా? ఇక మళ్లీ ఎప్పటిలాగే రోజువారీ జీవితం మొదలవుతుంది. మీకు నచ్చినట్లు ఆడవాళ్లను (Women) తొక్కేయొచ్చు… హింసించొచ్చు (Harass)’’ అంటూ ఆమె పురుష సమాజాన్ని ప్రశ్నించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రస్తావిస్తూ ఆమె తీవ్రంగా స్పందించారు.

విమర్శలకు గట్టి సమాధానం
సోషల్ మీడియాలో తనను ‘మగాళ్లను ద్వేషించే వ్యక్తి’గా (Man Hater) విమర్శించే వారిపైనా ఆమె విరుచుకుపడ్డారు. ‘‘కొంతమంది కామెంట్లు చేస్తూ నీకు మగాళ్లంటే అసహ్యం అంటారు. అదే సమయంలో నిన్ను పోషించడానికి ఎవరో ఒక మగాడు ఉంటాడులే అంటారు. నేను మగాళ్లను ద్వేషిస్తానని చెబుతూనే, మళ్లీ నన్ను పోషించడానికి మగాడు కావాలని మీరు అనడం ఏ అర్థం?’’ అని ఆమె ప్రశ్నించారు. ‘‘ఆడది ఎప్పుడూ మగాడి ఆధీనంలోనే ఉండాలని మీ భావమా?’’ అంటూ మాధవీలత తీవ్రంగా విమర్శించారు.

మగాళ్లపై ఘాటు వ్యాఖ్యలు
మగాళ్లు తమ తప్పులను పక్కన పెట్టి మహిళలను తక్కువ చేసి చూస్తారని ఆమె ఆరోపించారు. ‘‘ప్రతి ఒక్క మగాడు గురివింద గింజ లాంటి వాడే. మీ ముఖం మీరు అద్దంలో చూసుకుంటే, ఒక కాకి కూడా మీ మీద రెట్ట వేయడానికి మీరు పనికిరారు’’ అంటూ ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ మహిళల పట్ల జరిగే అన్యాయాలపై మాట్లాడటానికి ధైర్యం కావాలని అంటుంటే, మరికొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలు మరీ తీవ్రంగా ఉన్నాయని విమర్శిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment