---Advertisement---

MAD Square : అదిరిపోయిన ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్

MAD Square : అదిరిపోయిన 'మ్యాడ్ స్క్వేర్' టీజర్
---Advertisement---

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ (Narne Nithiin), సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్న మ్యాడ్‌ స్క్వేర్ (MAD Square) టీజర్ (Teaser) వ‌చ్చేసింది. 2023లో విడుదలైన మ్యాడ్ (MAD) సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మ్యాడ్ సినిమా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. దీనికి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్‌ను మేక‌ర్స్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయనుంది. మ్యాడ్ స్క్వేర్ టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు.

అదిరిపోయిన టీజర్..
టీజర్ చూస్తే మరోసారి నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతున్నట్లు స్పష్టమైంది. ల‌వ్ అండ్ కామెడీ ప్రధానంగా మలిచిన ఈ చిత్రంలో భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. మ్యాడ్‌ స్క్వేర్ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తంగా మ్యాడ్‌ స్క్వేర్ టీజర్ ప్రేక్షకులకు నవరసాల హంగామా గ్యారంటీ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment