సంగీత్ శోభన్(Sangeeth Shobhan), నార్నె నితిన్(Naren Nithin), రామ్ నితిన్(Ram Nithin) ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’(MAD Square) మూవీపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించే ‘వచ్చార్రోయ్’ సాంగ్(Vacharroi Song) విడుదలైంది.
భీమ్స్ మ్యూజిక్ .. మాస్ బీట్స్
ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో(Bheems Ceciroleo) సంగీతాన్ని అందించగా, ‘వచ్చార్రోయ్’ సాంగ్ బీట్స్, లిరిక్స్ మాస్ వర్గాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ విడుదలైన ఈ సాంగ్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. మాస్ ఎలిమెంట్స్, ఎనర్జీతో నిండిన ఈ పాట ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉంది.