మా సినిమాల వ‌ల్లే మీకు రెవెన్యూ.. వెబ్‌సైట్స్‌పై నిర్మాత చిందులు

మా సినిమాల వ‌ల్లే మీకు రెవెన్యూ.. వెబ్‌సైట్స్‌పై నిర్మాత చిందులు

టాలీవుడ్ (Tollywood) యంగ్ యాక్టర్స్ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్’ సినిమా 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా, ఈ మూవీకి సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్ (MAD Square)’ మార్చి 28న విడుదలై ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటివరకు రూ. 50 కోట్లకుపైగా వసూలు చేసి, రూ.100 కోట్ల దిశగా దూసుకెళ్తోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నాగవంశీ (Naga Vamsi) మీడియాతో మాట్లాడారు. “సినిమాలో కంటెంట్ ఉందనగానే హిట్ అవుతుందనే విషయం మరోసారి రుజువైంది. కానీ, కొంతమంది సీక్వెల్ కాబట్టి సినిమా ఆడుతోందంటూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు” అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

నా సినిమాలు బ్యాన్ చేయండి
సినిమాపై అనవసరమైన నెగిటివ్ రివ్యూలు (Negative Reviews) రాస్తున్నవారిపై నాగవంశీ తీవ్రస్థాయిలో స్పందించారు. “కంటెంట్ లేకపోతే మా సినిమాలు ఆడుతాయా? పక్కన ఉన్న సినిమా బాగోలేక ఆడటం లేదు, మా సినిమా బాగుండే ప్రేక్షకులు చూస్తున్నారు” అని క్లారిటీ ఇచ్చారు. ఇకపై తన సినిమాలను విమర్శించే వారు ధైర్యముంటే వాటిని పూర్తిగా బ్యాన్ (Ban) చేయాలని సవాల్ విసిరారు. “నా మీద పగ ఉంటే నా సినిమాలు బ్యాన్ చేయండి. మా సినిమాల గురించి రాయకండి. మా దగ్గర యాడ్స్ తీసుకోకండి. కానీ, మా సినిమాలు రిలీజ్ కాకపోతే మీ వెబ్‌సైట్స్ (Websites), యూట్యూబ్ ఛానెల్స్ (YouTube Channels) ఏమీ వర్క్ అవవు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

గతేడాది ‘లక్కీ భాస్కర్ (Lucky Bhaskar)’ హిట్ ఇచ్చిన నాగవంశీ, ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’తో మరో విజయాన్ని అందుకున్నారు. కానీ, నెగిటివ్ ప్రచారంతో సినిమాలను చంపే ప్రయత్నాలు మాత్రం సహించబోనని స్పష్టంగా తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment