అర్ధ‌రాత్రి ఆర్ఎంపీ వైద్యుడిపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల దాడి.. బంద‌రులో హైటెన్ష‌న్‌

అర్ధ‌రాత్రి ఆర్ఎంపీ వైద్యుడిపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల దాడి.. బంద‌రులో హైటెన్ష‌న్‌

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్‌ను విమ‌ర్శించినందుకు ఆర్ఎంపీ వైద్యుడు పోతుమూడి గిరిధర్ కుమార్ ఇంటిపై 100 మందికి పైగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ పెద్ద ఎత్తున దాడి చేశారు. తాళ్లపాలెం పంచాయతీ హెచ్. సత్తెనపాలెంలోని ర‌జ‌క సామాజిక వ‌ర్గానికి చెందిన ఏకైక వ్య‌క్తి గిరిధర్ నివాసానికి సుమారు వందమంది జనసేన కార్యకర్తలు చేరుకుని విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంటిని ధ్వంసం చేసి, వైద్యుడిని కొట్టి, పవన్ కళ్యాణ్‌కు మోకాళ్లపై కూర్చోబెట్టి బ‌ల‌వంతంగా క్షమాపణలు చెప్పించారు. ఆర్ఎంపీ వైద్యుడిపై జ‌న‌సేన దాడి వీడియోలు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

స‌త్తెన‌పాలెంకు చెందిన ఆర్ఎంపీ గిరిధ‌ర్ ఇటీవ‌ల అన్న‌దాత పోరులో పాల్గొని యూరియా క‌ష్టాల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను విమ‌ర్శించాడు. ఆ విమ‌ర్శ‌ల‌ను త‌ట్టుకోలేక‌పోయిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు గ‌త రాత్రి అత‌నిపై దాడి చేశారు. ఈ దాడిలో గిరిధర్ ఇంటిపక్కనే ఉన్న దళితుడు సతీష్ కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అతని షాపును ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరగడం కలకలం రేపింది. బాధితుడిని స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా జనసేన నేత కొరియర్ శ్రీను, ఇతర కార్యకర్తలు తిరగబడి బూతులు తిట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. “మా నాయకుడిని తిట్టితే ఏం చేస్తున్నారంటూ” పోలీసులు ఎదిరించిన ఘటన ఉద్రిక్తత సృష్టించింది.

పేర్ని నాని ఆగ్రహం..

ఈ సంఘటనపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ముసుగులో రౌడీయిజం పెరుగుతోందని ఆయన మండిపడ్డారు. గిరిధర్ రజకుడని చిన్న చూపుతోనే దాడి చేశారని నాని అన్నారు. “పవన్ కళ్యాణ్‌ను విమర్శించే వారిలో ఇతర కులాలకు చెందినవారూ ఉన్నారు. వారిపై మాత్రం మీరు దాడి చేయలేరు. బలహీనులే మీకు కనిపిస్తారా?” అని ప్రశ్నించారు.

పోలీసులను, జిల్లా ఎస్పీని ఉద్దేశించి “ఈ గూండాలను కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారు” అని హెచ్చరించారు. “జగన్, నన్ను, నా కొడుకుని నోటికొచ్చినట్లు తిడతారు. కానీ పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా మాట్లాడితే దాడులు చేస్తున్నారు” అంటూ మండిపడ్డారు. గిరిధర్, సతీష్‌లపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment