సీపీఎం పార్టీకి కొత్త నాయకుడు.. చ‌రిత్ర సృష్టించిన బేబీ

సీపీఎం పార్టీకి కొత్త నాయకుడు.. చ‌రిత్ర సృష్టించిన బేబీ

సీపీఎం (CPM) పార్టీ చరిత్రలో మరో కీలక ఘ‌ట్టం చోటుచేసుకుంది. తమిళనాడు (Tamil Nadu) మధురైలో జరిగిన 24వ పార్టీ కాంగ్రెస్‌లో కేరళ (Kerala) కు చెందిన సీనియర్ నేత ఎంఏ బేబీ (M.A. Baby) ని పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. సీతారాం ఏచూరి (Sitaram Yechury) మ‌ర‌ణంతో ఖాళీ అయిన సీపీఎం జాతీయ కార్య‌ద‌ర్శి ప‌ద‌వికి 71 ఏళ్ల బేబీని ఎన్నుకున్నారు. ఇప్పటికే ఈయ‌న‌ సీపీఎం పాలిట్ బ్యూరోలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఎంపికతో పాటు, కొత్త కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులను కూడా ప్రకటించారు. కేరళలోని కొల్లాం జిల్లాలో జన్మించిన బేబీ విద్యార్థి దశ నుంచే ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ వంటి పార్టీవింగ్‌లలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1986-1998 మధ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన, 2006-2011లో కేరళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి (Education Department Minister) గా పనిచేశారు.

సీపీఎం చరిత్రలో మరో మైలురాయి
ఎంఏ బేబీ మైనారిటీ కమ్యూనిటీ (Minority Community) నుంచి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అంతకుముందు కేరళకు చెందిన మరో ప్రముఖుడు, రాష్ట్ర తొలి సీఎం అయిన ఈఎంఎస్ నంబూద్రిపాల్ మాత్రమే ఈ పదవిని చేపట్టారు. గతేడాది సీతారాం ఏచూరి మరణంతో ఖాళీ అయిన ఈ పదవిని తాత్కాలికంగా ప్రకాష్ కారత్ నిర్వహించారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో బేబీ అధికారం చేపట్టారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్ తదితరులు బేబీకి శుభాకాంక్షలు (Congratulations) తెలిపారు.

కొత్తగా ఏర్పాటైన పోలిట్ బ్యూరోలో పినరయి విజయన్, బివి రాఘవులు, తపన్ సేన్, ఎండీ సలీం, ఎ విజయరాఘవన్, నీలోత్పల్ బసు, అశోక్ ధావలే, అమ్రా రామ్, విజూ కృష్ణన్, యు వాసుకి, కె బాలకృష్ణన్ తదితరులు ఉన్నారు. మొత్తంగా 85 మందితో కూడిన కొత్త కేంద్ర కమిటీని పార్టీ ఎన్నుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment