‘సిగాచి’ మృతులకు రూ.కోటి ప‌రిహారం.. – సీఎం రేవంత్

'సిగాచి' మృతులకు రూ.కోటి ప‌రిహారం.. - సీఎం రేవంత్

పటాన్‌చెరు (Patancheru) పాశమైలారం (Pashamylaram) ఫ్యాక్టరీ (Factory)లో జరిగిన ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటివరకు జరగలేదని తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. మంగళవారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడం బాధాకరమని సీఎం రేవంత్ అన్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 147 మంది ఉండగా, 57 మంది సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నామని వివరించారు.

చనిపోయినవారి కుటుంబాలకు రూ.1 కోటి (Rs. 1 crore) నష్టపరిహారం (Compensation) అందించాలని ఆదేశించినట్లు సీఎం ప్రకటించారు. ఈ విషయమై ప్రభుత్వం తరఫున మంత్రులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరుపుతారని పేర్కొన్నారు. అలాగే, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షల సాయం అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. గాయపడి, కోలుకున్నప్పటికీ తిరిగి పనిచేయలేని స్థితిలో ఉన్న బాధితులకు సైతం రూ.10 లక్షలు కచ్చితంగా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవత్వంతో అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. మృతుల్లో తమిళనాడు, బీహార్, జార్ఖండ్ వాసులు అధికంగా ఉన్నారని, మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు కూడా ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు. మృతుల కుటుంబాల పిల్లల చదువు విషయంలోనూ ప్రభుత్వం సాయం చేస్తుందని ప్రకటించారు.

“ఇలాంటి ప్రమాదం తెలంగాణలో ఇప్పటివరకు జరగలేదు. యాజమాన్యాలు ఇక నుంచి భద్రతపై దృష్టి సారించాలి. ప్రమాదాలను నివారించాలి. ప్రమాదాలు జరగకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. నిర్లక్ష్యం ఉంటే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వం తరఫున అత్యున్నత దర్యాప్తు జరిపిస్తున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment