ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తమిళనాడు తీరం దాటనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
17, 18 తేదీల్లో విస్తార వర్షాలు
ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పంటలపై ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారి ప్రయాణాలు చేసే వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
భారీ వర్షాలకు సిద్ధంగా ఉండండి
వాతావరణ శాఖ సూచించినట్లుగా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.







