మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక

రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండ్రోజుల్లో రుతుపవనాలు (Monsoon Winds) కేరళ (Kerala) ను తాకే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో (Arabian Sea) ఏర్పడిన అల్పపీడనం (Low-Pressure Area) వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని పలు ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు, తెలంగాణ (Telangana)లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.

ఈ నెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న రుతుపవనాల చొచ్చుకువచ్చే దిశలో మరింత ఊతమివ్వనుందని అంచనా. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు, రైతులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment