ప్రేమ విఫలమైతే మనసు బాధతో నిండిపోతుంది. కానీ బెంగళూరుకు చెందిన ఓ సంస్థ మాత్రం బ్రేకప్ అయిన వారికి ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. ఇది ఏ ఉద్యోగం? లవ్ బ్రేకప్‌కు ఉద్యోగానికి ఉన్న సంబంధమేంటి? అనుకుంటున్నారా..? అది తెలుసుకోవాలంటే పూర్తిగా చదవండి.
ప్రేమ విఫలమైన వారికే ఈ ఉద్యోగం
బెంగళూరులోని మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ టాప్‌మేట్ (Topmate) చీఫ్ డేటింగ్ ఆఫీసర్ పోస్టు కోసం ప్రత్యేక నిబంధనలు పెట్టింది. ఈ ఉద్యోగం పొందడానికి 3 డేట్స్ చేయాలి. 2 సిట్యుయేషన్‌షిప్‌లు అనుభవం ఉండాలి. కనీసం ఒక లవ్ బ్రేకప్ అయ్యుండాలి అనే వినూత్న నిబంధనలు పెట్టింది. ఈ అర్హత కలిగి ఉన్నవారికి డేటింగ్ ప్రపంచంపై మంచి అవగాహన ఉంటుందని భావిస్తున్నారు. అయితే, క్యాట్‌ఫిషింగ్ చేయకూడదని స్పష్టం చేశారు.
Hiring Alert!
— Nimisha Chanda (@NimishaChanda) January 29, 2025
We are looking for a Chief Dating Officer.
Are you the go-to friend for dating advice? We’re hiring someone who lives and breathes dating culture.
The self-proclaimed matchmaker who can decode “ghosting,” “breadcrumbing,” and every new dating buzzword in the… pic.twitter.com/yqyJJiCVJy
ఈ ప్రత్యేకమైన ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీతం గురించి స్పష్టమైన సమాచారం లేదు కానీ, డేటింగ్ సంబంధిత అనుభవం ఉన్నవారికి ఇది ఆసక్తికరమైన అవకాశమవుతుందనడంలో సందేహమే లేదు!