డిసెంబరు 21.. లాంగెస్ట్ నైట్ నిజ‌మేనా?

డిసెంబరు 21.. లాంగెస్ట్ నైట్ నిజ‌మేనా?

నేడు ఆకాశంలో సంభ‌వించే ఓ మార్పును మిస్ అవ్వొద్దు అని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. ఒక రోజు అంటే దాంట్లో 12 గంట‌ల పగ‌లు, 12 గంట‌ల రాత్రి ఉంటుంద‌ని మ‌న‌కు తెలుసు కానీ, ఈరోజు డిసెంబ‌ర్ 21న ఓ వింత జ‌ర‌గ‌బోతోందంటే గ‌త వారం రోజులుగా వార్త‌లు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబరు 21 లాంగెస్ట్ నైట్ ఉండ‌బోతోంద‌ని అంతర్జాతీయ మీడియా కూడా ఆసక్తికర కథనాలుగా ప్రసారం చేస్తోంది.

వింటర్ సోల్​స్టీస్ అంటే ఏమిటి?
పగలు తక్కువ సమయం, రాత్రి ఎక్కువగా ఉండే పరిస్థితిని వింటర్​ సోల్​స్టీస్​ అంటారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 19 నుంచి 23 మధ్యలో వింటర్​ సోల్​స్టీస్ ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి సూర్యునికి 23.4 డిగ్రీల వంపులో తలవంచి ఉంటుంది. దీని వల్ల భూమి మీద చీకటి ఎక్కువగా ఉండి, పగలు సమయం తగ్గిపోతుంది.

ఉష్ణోగ్రతలలోనూ మార్పులు సంభవించి, దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగానే.. ఇవాళ.. అత్యంత తక్కువగా పగలు, సుదీర్ఘమైన రాత్రి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment