స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సన్నాహాలపై (Local Bodies Election Arrangements) రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని (Rani Kumudini) అధ్యక్షతన కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు (Chief Secretary Ramakrishna Rao), డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy)తో పాటు జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. శాంతిభద్రతల నిర్వహణను మెరుగుపరచడానికి డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రతిపాదన చేశారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రతి జిల్లాలో ఎన్నికలను మూడు దఫాలుగా (Three Phases) నిర్వహించాలని, అలాగే ప్రతి దశ ఎన్నికల మధ్యలో రెండు రోజుల విరామం ఇవ్వాలని ఆయన సూచించారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత ర్యాలీలు, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉన్నందున, భద్రతా సిబ్బందికి విశ్రాంతి, బందోబస్తు నిర్వహణకు ఈ విరామం తప్పనిసరి అని డీజీపీ వివరించారు.
డీజీపీ సూచనలపై చర్చానంతరం, ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని, సమస్యాత్మక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేందుకు వీలుగా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి రాష్ట్రస్థాయి రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారులను ఆదేశించింది.








