కారు ప్రమాదంలో ఫుట్‌బాల్ ప్లేయర్ మరియు సోదరుడు దుర్మరణం!

కారు ప్రమాదంలో ఫుట్‌బాల్ ప్లేయర్ మరియు సోదరుడు దుర్మరణం!

ఫుట్‌బాల్ (Football) ప్రపంచంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్పెయిన్‌ (Spain)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లివర్‌పూల్ (Liverpool) ప్లేయర్ (Player) డియోగో జోటా (Diogo Jota) (28), అతని సోదరుడు ఆండ్రీ జోటా (Andre Jota) (26) ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. కేవలం రెండు వారాల క్రితమే తన ప్రియురాలు రూట్ కార్డోసో (Root Cardoso)ను వివాహం చేసుకున్న డియోగో (Diogo), ఇంతలోనే మృత్యువు ఒడిలోకి చేరడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది.

ప్రమాద వివరాలు
ఈ ప్రమాదం వాయువ్య స్పెయిన్‌లోని జమోరా ప్రావిన్స్‌ (Zamora Province)లోని ఏ-52 రహదారిపై జరిగింది. అర్ధరాత్రి 12:40 గంటల (స్థానిక కాలమానం) ప్రాంతంలో వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక నివేదికలు తెలియజేస్తున్నాయి. మంటలు అంటుకోవడంతోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

డియోగో జోటా, ఆండ్రీల ప్రస్థానం
డియోగో జోటా సెప్టెంబర్ 2020లో వోల్వర్‌హాంప్టన్ (Wolverhampton) వాండరర్స్ (Wanderers) నుంచి 40 మిలియన్లకు పైగా ఫీజుకు లివర్‌పూల్ తరపున సంతకం చేసి, జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. తన కెరీర్ పీక్స్‌లో ఉండగా, వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించి కేవలం రెండు వారాల క్రితమే రూట్ కార్డోసోను వివాహం చేసుకున్నాడు.

డియోగో సోదరుడు ఆండ్రీ జోటా విషయానికొస్తే, అతను పోర్చుగీస్ సెకండ్ డివిజన్ క్లబ్ అయిన పెన్నాఫియల్ తరపున ఫుట్‌బాల్ ఆడాడు. ఈ సోదరులిద్దరి ఆకస్మిక మరణం ఫుట్‌బాల్ కమ్యూనిటీని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment