తెలంగాణ రాష్ట్రంలో బుధవారం పిడుగుపాటుకు గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి.నిర్మల్ జిల్లాలోని పెంబి మండలం, గుమ్మనుయోంగ్లాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. మృతులు బండారి వెంకటి, అల్లెపు ఎల్లయ్య, అల్లెపు ఎల్లవ్వగా గుర్తించారు.
అదేవిధంగా, జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం, భూంపురం గ్రామంలో సాయంత్రం వేళ పత్తి చేనులో పని చేస్తున్న కూలీలపై పిడుగు పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక యువకుడు మరణించారు. మృతులు భూంపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ (22), సర్వేశ్ (20), సౌభాగ్యమ్మ (40)గా గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు.