స్వీడన్ (Sweden) ఉత్తర (Northern) ప్రాంతం కిరునా (Kiruna)లో అరుదైన అద్భుత ఘటన చోటుచేసుకుంది. 113 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన చర్చిని మొత్తం 5 కిలోమీటర్ల దూరం (Kilometers Distance) తరలించడం అక్కడి ప్రజలకు చారిత్రాత్మక క్షణంగా నిలిచింది. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గనుల విస్తరణే కారణం
చర్చి ఉన్న ప్రాంతంలో గనుల విస్తరణ జరుగుతుండటంతో భూమి క్రమంగా కుంగిపోతోంది. భవిష్యత్తులో ప్రమాదం సంభవించవచ్చని అంచనా వేసిన అధికారులు, చర్చిని కాపాడే చర్యగా దానిని సురక్షిత ప్రదేశానికి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.
‘ది గ్రేట్ చర్చ్ వాక్’
భారీ క్రేన్ సహాయంతో చర్చిని పైకి లేపి, ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రక్కుపై ఉంచి తరలించారు. గంటకు 0.5 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రక్రియ సాగి, దాదాపు రెండు రోజులపాటు కొనసాగింది. స్థానికులు ఈ తరలింపుని చారిత్రాత్మకంగా భావిస్తూ “ది గ్రేట్ చర్చ్ వాక్” (The Great Church Walk) అని పేరు పెట్టారు.