పాన్ ఇండియా హీరోయిన్‌గా కుంభమేళా బ్యూటీ.. గ్రాండ్ ఎంట్రీ!

కుంభమేళా బ్యూటీకి లక్.. పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎంట్రీ!

మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ తనదైన అందంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన యువతి మోనాలిసా ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. కుంభమేళాలో ఆమెను చూసి ఆకట్టుకున్న బాలీవుడ్ దర్శక-నిర్మాత ఒకరు ఆమెకు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసినా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత షాప్ ఓపెనింగ్‌లతో బిజీగా గడిపిన ఈ అమ్మడిని, ఇప్పుడు టాలీవుడ్ పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఈ రోజు (నవంబర్ 5, 2025) హైదరాబాదులో ఆమె నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమం జరగబోతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రారంభం కావడం విశేషం.

ఈ పాన్ ఇండియా చిత్రంలో ‘క్రష్’, ‘ఇట్స్ ఓకే గురు’ సినిమాల హీరో చరణ్ సాయి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్‌పై అంజయ్య విరిగినేని, ఉషా విరిగినేని నిర్మిస్తున్నారు. గతంలో ‘లవ్ కే రన్’, ‘ఏకే రావు పీకే రావు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీను కోటపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పూజా కార్యక్రమం అనంతరం సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment