పెళ్లి తరువాత సినిమాలకు, మీడియాకు దూరంగా ఉంటూ, ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ (Bollywood) స్టార్ కత్రినా కైఫ్(Katrina Kaif) ఎట్టకేలకు అభిమానుల కంటపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Kumbh Mela)లో ప్రయాగ్‌రాజ్‌లో సందడి చేశారు. నటి కత్రినా కైఫ్ రెండ్రోజుల క్రితం ప్రయాగ్‌రాజ్‌లో దర్శనిమిచ్చారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం స్వామి చిదానంద్ సరస్వతిని కలిశారు.
ప్రయాగ్‌రాజ్‌లో కత్రినా కైఫ్‌ను చూసిన ఆమె ఫ్యాన్స్ ఆనందం (Fans Reaction) పొంగిపోయారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడుతూ హడావిడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలకు దూరంగా ఉన్నా ఫ్యాన్స్‌లో ఆమె క్రేజీ కొంత అయినా తగ్గలేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.