చర్చకు వచ్చే దమ్ముందా..? కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ సవాల్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములపై జరుగుతున్న వివాదానికి సంబంధించి టీపీసీసీ చీఫ్ (TPCC Chief) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హెచ్‌సీయూ భూములపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్‌ (Hyderabad) లో బంగారం విలువైన భూములను గతంలోనే బీఆర్ఎస్ నేతలే తమ సొంత వారికి అమ్మేశారని ఆరోపించారు. ఇప్పుడు వారు ఇతరులపై ఆరోపణలు చేయడం వాస్తవాలను మరచినట్టేనన్నారు. గత పదేళ్లలో హైదరాబాద్ భూములను మాయాజాలం చేసి ఎకరా రూ.100 కోట్ల వరకు అమ్మిన దారుణాన్ని గుర్తు చేశారు. మొత్తం 10 వేల ఎకరాల పైగా ప్రభుత్వ భూములు అక్రమంగా విక్రయించబడ్డాయని ఆరోపించారు.

బీఆర్ఎస్ నేతలు హెచ్‌సీయూ భూములపై విమర్శలు చేయడంపై మండిపడ్డ మహేశ్ కుమార్, ఆ భూములను గతంలో చంద్రబాబు ఐఎంజీ భరత్ సంస్థకు చెందిన బిల్లీరావుకు అప్పగించారని తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ భూములు తిరిగి ప్రభుత్వానికి దక్కాయనీ, సీఎం వై.ఎస్. రాజశేఖర రెడ్డి పోరాటంతో ఆ భూములు తిరిగి ప్రభుత్వానికి వచ్చాయని గుర్తు చేశారు.

తర్వాత కేసీఆర్ (KCR) హయాంలో మరిన్ని యూనివర్సిటీ భూములపై కన్నేసినట్లు ఆరోపించారు. అప్పటి మంత్రి కేటీఆర్ (KTR) ఐఎంజీ సంస్థ (IMG Company) తో 33 శాతం ముడుపుల ఒప్పందానికి వెళ్లారని చెప్పారు. అందులో భాగంగా రూ.5,200 కోట్లు లంచంగా తీసుకునే ప్రణాళిక ఉందని, ఇప్పుడు అదే వ్యవహారాన్ని కాంగ్రెస్ మీద మోపాలని ప్రయత్నం చేయడం దారుణమని విమర్శించారు.

రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌సీయూ భూములను తిరిగి సాధించిందని, నిజమైన భూముల పరిరక్షణ రాజశేఖర రెడ్డి నుంచే ప్రారంభమైందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

ముఖ్యంగా కేటీఆర్‌ను ఉద్దేశించి (Addressing), “దమ్ముంటే చర్చకు రా (If You Have Guts, Come For a Debate).. పదేళ్ల భూ దోపిడీపై నిన్ను నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం” అంటూ స్పష్టం చేసిన ఆయన వ్యాఖ్యలు రాజకీయ వేడి పెంచేలా ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment