---Advertisement---

సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్.. నేడు కీలక విచారణ

సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్.. నేడు కీలక విచారణ
---Advertisement---

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ రోజు (జనవరి 15) విచారణ జరగనుంది. ఈ నెల 8న జరిగిన ఫార్ములా-ఈ కారు రేసు విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఏసీబీ కేసు.. కేటీఆర్ స్పందన
తెలంగాణ హైకోర్టులో ఏసీబీ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. కానీ, హైకోర్టు దీనికి అనుమతి ఇవ్వకపోవడంతో, సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. కేటీఆర్ పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం. త్రివేది మరియు జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్పందన
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏసీబీ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరిణామాలు సుప్రీంకోర్టు తీర్పుకు ప్రాధాన్యత సంత‌రించుకుంది. సుప్రీం కోర్టుతో త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని కేటీఆర్ స‌హా బీఆర్ఎస్ శ్రేణులంతా ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment