బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి తీవ్ర గాయమైంది (Serious Injury). జిమ్ (Gym) లో వర్క్ అవుట్స్ సెషన్ సమయంలో ఆయనకు స్లిప్ డిస్క్ సమస్య తలెత్తింది. ఈ గాయానికి సంబంధించి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ (Bed Rest) తీసుకోవాలని స్పష్టంగా సూచించారు. తనకు జిమ్‌లో గాయమైందని కేటీఆర్ (KTR) స్వయంగా ట్వీట్ (Tweet) చేసి తెలిపారు.
జిమ్ వర్కౌట్ సెషన్‌లో స్లిప్ డిస్క్ గాయమైందని, కొలుకునేందుకు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారని ట్వీట్ చేశారు. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నానని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను అని వెల్లడించారు. కేటీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders), కార్యకర్తలు (Party Workers) ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.