రాష్ట్రంలోని యూరియా (Urea) కొరతపై బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతు (Farmer’s) ప్రభుత్వమేమీ కాదు.. రాక్షస ప్రభుత్వం (Demonic Government) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. 70 లక్షల మంది రైతులు (Farmer’s) ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు అని పేర్కొంటూ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పంట సాగు చేయాల్సిన సమయంలో రైతులు పొలాల్లో కాకుండా ఎరువుల కోసం దుకాణాల ఎదుట క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇలా ఎరువుల కోసం రైతులు తిరిగిన దాఖలాలు లేవన్నారు.
కేంద్రం అందించిన ఎరువులు కూడా రాష్ట్ర ప్రభుత్వం డ్రా చేయలేదని, అది రైతులపై ప్రభుత్వం చూపుతున్న విముఖతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. యూరియాపై ప్రభుత్వం సమీక్షలు జరపకపోవడం, కేంద్రం–రాష్ట్రం మధ్య సమన్వయం లేకపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని చెప్పారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏప్రిల్, మే నెలల్లోనే నోడల్ ఏజెన్సీ అయిన మార్క్‌ఫెడ్‌కి ముందస్తు ఆర్థిక సాయం అందించి, జూన్ నాటికి కనీసం 3–4 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ సిద్ధంగా ఉంచేవారన్నారు. అదనంగా డీలర్ల వద్ద 3 లక్షల టన్నుల బఫర్ స్టాక్ ఉండేలా వ్యవస్థ పటిష్టంగా నిర్వహించేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం తలెత్తిన యూరియా, డీఏపీ కొరత పూర్తిగా ప్రభుత్వం తప్పుడు ప్రణాళికల ఫలితమని స్పష్టం చేశారు.







