---Advertisement---

కాంగ్రెస్ పాలనలో ‘పల్లె కన్నీరు’.. కేటీఆర్ ట్వీట్ వైర‌ల్‌

కాంగ్రెస్ పాలనలో పల్లె కన్నీరు.. కేటీఆర్ తీవ్ర విమర్శలు
---Advertisement---

తెలంగాణ (Telangana) రాష్ట్రం పల్లెలు కాంగ్రెస్ (Congress) పరిపాలనలో కన్నీరు కారుస్తున్నాయని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం (National Panchayati Raj Day) సందర్భంగా ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్ర‌భుత్వంలో చేపట్టిన ‘పల్లె ప్రగతి’ (Palle Pragathi) కార్యక్రమాలను గుర్తుచేశారు. ట్విట్టర్ (Twitter) వేదిక‌గా స్పందించిన కేటీఆర్.. కేసీఆర్ (KCR) నాయకత్వంలో పదేళ్లపాటు పల్లెలు అభివృద్ధిలో మునిగిపోయాయని, గ్రామీణ తెలంగాణ రూపురేఖలే మారిపోయాయని అని గుర్తుచేశారు. ప‌ల్లె ప్రగతి, హరితహారం (Haritha Haram – Massive Afforestation Program) వంటి కార్యక్రమాలతో గ్రామాల‌ను సుంద‌రంగా తీర్చిదిద్దార‌న్నారు.

గ్రామ స్వరాజ్యం గాడితప్పింది..
ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్.. గ్రామ స్వరాజ్యం పూర్తిగా గాడి తప్పిపోయిందన్నారు. స్థానిక సంస్థలకే ఎన్నికలు జరగడం లేదన్నారు. గ్రామాల్లో కనీస వసతులు కూడా క‌రువ‌య్యాయ‌న్నారు. చివరికి పంచాయతీ సిబ్బందికి వేతనాలే ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల పరిస్థితి దారుణంగా ఉందని, కాంగ్రెస్ పాలనకు గ్రామాల భవిష్యత్తు దెబ్బతింటోంది అని ట్వీట్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment