ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమేనా? : కేటీఆర్

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమేనా? : కేటీఆర్

ఖమ్మం జిల్లా (Khammam District) వెలుగుమట్లలో (Velugumatla) వందలాది పేదల ఇళ్ల కూల్చివేత ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వమే జారీ చేసిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు, ఆస్తి పన్ను రశీదులు, విద్యుత్ కనెక్షన్ ధృవపత్రాలు ఉన్నప్పటికీ అర్ధరాత్రి నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేయడం అమానుష చర్య అని ఆయన మండిపడ్డారు. “ఇందిరమ్మ రాజ్యం (Indiramma Rajyam)అంటే పేదల ఇళ్లు కూల్చడమేనా?” అని ప్రశ్నించిన కేటీఆర్, ఖమ్మంలోనే కాక మహబూబ్‌నగర్‌లో దివ్యాంగుల ఇళ్ల కూల్చివేత కూడా ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని ఆరోపించారు. కేవలం అధికారుల బదిలీలతో బాధ్యత నుంచి తప్పించుకోలేరని, బాధితులకు పూర్తి న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన కేటీఆర్, “మీరు అధైర్యపడకండి… ఇదే స్థలంలో మళ్లీ ఇళ్లు కట్టించి గృహప్రవేశాలు చేయించే బాధ్యత నాది” అంటూ భరోసా ఇచ్చారు. శాసనసభ నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం బాధితులను విడదీసే ప్రయత్నాలు చేసినా, ఐకమత్యంగా ఉంటేనే విజయం సాధ్యమని సూచించారు. చట్టపరమైన ఆధారాలు బాధితులవైపే ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పేదల పక్షాన న్యాయపోరాటం కొనసాగిస్తామని, పరిపాలనా వ్యవస్థ చేసిన తప్పులను బయటపెడతామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment