“ఎనుముల కాదు.. అనకొండ రేవంత్” – కేటీఆర్ విమర్శలు

“ఎనుముల కాదు.. అనకొండ రేవంత్” - కేటీఆర్ విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) బీసీ (BC Communities)లపై “తీరని ద్రోహం” చేసిందని, బీసీ రిజర్వేషన్ల (BC Reservations)విషయంలో కాంగ్రెస్ తప్పుదారి పట్టిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమ‌ర్శించారు. వరంగల్‌ (Warangal)లోని కాకతీయ మెగా టెక్స‌టైల్ పార్క్ (KMTP) పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయ‌న గతంలో బీసీ రిజర్వేషన్లు 24% ఉండగా, 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు.

24 శాతం ఉన్న రిజ‌ర్వేష‌న్‌ను ఇప్పుడు రిజర్వేషన్లను 17% కు తగ్గించడం బీసీ వర్గాలపై భారీ అన్యాయమని కేటీఆర్‌ మండిపడ్డారు. అనేక మండలాల్లో ఒక బీసీ ప్రతినిధికీ అవకాశం ఇవ్వని విధంగా రిజర్వేషన్ల వ్యవస్థను రూపొందించారని ఆరోపించారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేశారు.“ఎనుముల రేవంత్ కాదు… అనకొండ రేవంత్” అని వ్యాఖ్యానించారు.

KMTP కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం
కాకతీయ టెక్స‌టైల్ పార్క్ అభివృద్ధిపై మాట్లాడుతూ కేటీఆర్, వరంగల్‌ను పునర్నిర్మించడానికి కేసీఆర్(KCR) పెట్టిన దూరదృష్టిని వివరించారు. ఒకప్పుడు అజంజాహి మిల్లులతో గుర్తింపుపొందిన వరంగల్, ఉమ్మడి రాష్ట్రంలో తన వైభవాన్ని కోల్పోయిందని చెప్పారు. ఉపాధి కోసం నేతన్నలు సూరత్, భివాండి, షోలాపూర్‌లకు వలస వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తుచేశారు.

ఈ పరిస్థితులను మార్చేందుకు 2017లో కేసీఆర్ KMTP శంకుస్థాపన చేశారని, ఇప్పుడు ఇది భారీ పారిశ్రామిక కేంద్రంగా మారుతోందని అన్నారు. పార్కులో కైటెక్స్, యంగ్‌వన్, గణేషా వంటి ప్రముఖ సంస్థలు కార్యకలాపాలకు సిద్ధమవుతున్నాయని, వీటి ద్వారా 25–30 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. భూసేకరణలో సహకరించిన ధర్మా రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
పార్క్‌లో ఇంకా పెండింగ్‌లో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులను—ఫ్లైఓవర్ (ROB), డ్రైనేజ్, సివరేజ్, కామన్ ఫెసిలిటీలు—రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కేటీఆర్ కోరారు. ప్రభుత్వాలు మారినా ప్రజల ప్రయోజనం శాశ్వతమని, KMTP ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే వరంగల్ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. కేసీఆర్ రూపొందించిన పారిశ్రామిక దృక్పథం తెలంగాణ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందనీ, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment