బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్)(KTR), కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో (By Elections) కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే, ఆ పార్టీకి భయం పట్టుకుని 2023 ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను (Six Guarantees) అమలు చేస్తుందని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా ఓడించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత క్షేత్రస్థాయి వాస్తవాలను ఆలస్యంగా గ్రహిస్తున్న కాంగ్రెస్, తమ పార్టీ పరువును కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను కేటీఆర్(KTR) ‘ఆపదమొక్కులు’ గా అభివర్ణించారు. సినీ కార్మికులకు వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ (Cricketer) అజారుద్దీన్ (Azharuddin)ను కేబినెట్ (Cabinet)లోకి తీసుకోవడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ (Hyderabad) వీధుల్లో హడావుడిగా తిరగడం వంటి చర్యలన్నీ కాంగ్రెస్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ ఈ రకమైన ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్‌ను కోల్పోవడం అనేది, వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు దోహదపడుతుందని కేటీఆర్ తమ ట్వీట్‌లో స్పష్టం చేశారు.





 



