ఎస్ఎల్ బీసీ (SLBC) టన్నెల్ ప్రమాదం (Tunnel Accident) జరిగిన కొన్ని మూడు నెలలు అయినప్పటికీ, మృతదేహాలను (Dead Bodies) ఇంకా వెలికి తీయలేకపోవడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. సమర్థవంతమైన నాయకుడు ఉంటే మూడు నెలల్లో అంగారక గ్రహం నుంచి మానవులను కూడా తీసుకురాగలడు. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కారణంగా ఎస్ఎల్ బీసీ సొరంగంలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయలేకపోతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మృతదేహాలను వెలికి తీసుకోవడంలో ప్రభుత్వం చెప్పే మాటలు కోటలు దాటుతున్నా, అక్కడ మట్టి కూడా తీయలేకపోయారని, ఇది రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. మృతదేహాలను కూడా వెలికితీయలేకపోయినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. కనీసం సంతాప ప్రకటన చేసి, మరణించిన కుటుంబాలను పరామర్శించాల్సిన మానవత్వం ఈ ముఖ్యమంత్రికి లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబాలను చిన్నాభిన్నం చేసినందుకు బాధితుల కాళ్ళు (Feet) పట్టుకుని (Holding) క్షమాపణలు (Apologies) కోరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.