---Advertisement---

హైకోర్టులో KTR పిటిషన్

హైకోర్టులో KTR పిటిషన్
---Advertisement---

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (KTR) ఫార్ములా ఈ-రేస్ కేసులో హైకోర్టును ఆశ్ర‌యించారు. అగస్త్య ఇన్వెస్ట్‌మెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ACB తనపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టులో లంచ్‌మోష‌న్‌ పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఈ నేపథ్యంలో, KTR తనపై నమోదు చేసిన ACB కేసును క్వాష్ చేయాలని కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు విచారించనున్నారు. మధ్యాహ్న భోజనాన్ని తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.

అర‌పైసా అవినీతి లేదు
ఈ కేసుపై కేటీఆర్ స్పందిస్తూ.. త‌న‌పై వేసిన కేసు నిల‌వ‌ద‌ని, కేసులో లీగ‌ల్‌గానే ముందు వెళ్తున్నామ‌ని చెప్పారు. కోర్టులో లంచ్ మోష‌న్ పిటీష‌న్ దాఖ‌లు చేశామ‌ని చెప్పారు. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అవినీతి జ‌ర‌గ‌లేదంటున్నారని చెప్పారు. డ‌బ్బుల పంపిన విధానం త‌ప్పు అని పొన్నం అంటున్నారు. మంత్రిగా తాను ఫార్మాలా ఈ- రేస్ విష‌యంలో విధానప‌ర‌మైన‌ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని కేటీఆర్ చెప్పారు. ఫార్ములా ఈ – రేసులో అర‌పైసా అవినీతి కూడా జ‌ర‌గ‌లేద‌ని కేటీఆర్ చెప్పారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment