ఏసీబీ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు పలు కీలక విషయాలను వెల్లడించింది. ఏసీబీ విచారణలో తన లాయర్‌ను తనతో పాటు కూర్చోబెట్టాలని కోరిన కేటీఆర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, దూరం నుంచే లాయర్‌కు విచారణను గమనించేందుకు అనుమతి ఇవ్వడానికి హైకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌పై విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
లాయర్‌తోనే విచారణకు హాజరవుతానని, పోలీసులపై తనకు నమ్మకం లేదని ఇటీవల కేటీఆర్ మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. పట్నం నరేందర్‌రెడ్డి విషయంలో పోలీసులు తప్పుడు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారని, తన విషయంలో అలాంటిది జరగదని నమ్మకం ఏంటి..? అని కేటీఆర్ ప్రశ్నించారు. లాయర్లతోనే విచారణకు వస్తానని కేటీఆర్ చెబుతున్నారు.