కేటీఆర్‌కు లండ‌న్ నుంచి పిలుపు.. అరుదైన‌ ఆహ్వానం

కేటీఆర్‌కు లండ‌న్ నుంచి పిలుపు.. అరుదైన‌ ఆహ్వానం

బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అరుదైన ఆహ్వానం అందింది. మరో అంతర్జాతీయ వేదికపై ప్రసంగించేందుకు ఆహ్వానం అందింది. బ్రిటన్‌ (Britain) లోని ప్రముఖ సంస్థ బ్రిడ్జ్ ఇండియా (Bridge India), లండన్‌ (London) లో జరగనున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా (Ideas for India) – 2025’ సదస్సుకు కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ సదస్సు మే 30న రాయల్ లాంకాస్టర్ (Royal Lancaster) హోటల్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.

బ్రిడ్జ్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రతీక్ దత్తానీ (Pratik Dattani) ఈ ఆహ్వానాన్ని పంపిస్తూ, 2023లో ఇదే సదస్సులో కేటీఆర్ ప్రసంగం ఎంతో మంది దృష్టిని ఆకర్షించిందని కొనియాడారు. తెలంగాణ (Telangana) లో ప్రభుత్వం మారినా, లండన్ వ్యాపార వర్గాలు, ఇండో-యూకే (Indo-UK) కారిడార్ ప్రముఖులు, తెలుగు ప్రవాసులు కేటీఆర్‌ను కలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.

భారత్-బ్రిటన్ సంబంధాల్లో కేటీఆర్ ప్రాముఖ్యత
ఈ సదస్సుకు 900 మందికి పైగా వ్యాపార ప్రముఖులు, పాలసీ మేకర్లు, తెలుగు ప్రవాసులు హాజరవుతారని భావిస్తున్నారు. భారత ఆర్థిక ప్రగతి, విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సంబంధాల పురోగతి వంటి అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. కేటీఆర్ తన పర్యటనలో బ్రిటన్ పారిశ్రామికవేత్తలు, ప్రవాసులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చే అవకాశముంది.

Join WhatsApp

Join Now

Leave a Comment