బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కు బిగ్‌షాక్ తగిలింది. ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. నకిరేకల్ (Nakrekal) పట్టణంలో పదో తరగతి (10th Class) తెలుగు పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలతో నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
ఎవరి ఫిర్యాదుతో కేసు?
నకిరేకల్ మున్సిపల్ చైర్‌పర్సన్ చౌగోని రజిత (Chaugoni Rajitha), కాంగ్రెస్ నేతలు కలిసి కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి మన్నె క్రిశాంక్ (Manne Krishank), కొణతం దిలీప్ కుమార్ (Konatham Dilip Kumar) లపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తను వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ ‘X’ (ట్విట్టర్)లో షేర్ చేశారని ఆరోపించారు.
పోలీసుల విచారణలో ఏమొచ్చింది?
పేపర్ లీకేజీ (Paper Leakage) వ్యవహారంలో ఇప్పటివరకు ఒక మైనర్‌తో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కేటీఆర్‌పై దర్యాప్తు (Investigation)ను పోలీసులు ముమ్మరం చేసే అవకాశముంది.