పిల్ల‌ల‌కు గొడ్డుకారం.. సీఎం భోజనం ఖర్చు రూ.32 వేలు – కేటీఆర్ సంచ‌ల‌న ట్వీట్‌

పిల్ల‌ల‌కు గొడ్డుకారం.. సీఎం భోజనం ఖర్చు రూ.32 వేలు - కేటీఆర్ సంచ‌ల‌న ట్వీట్‌

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై సెటైర్లు వేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. నల్ల‌గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ కృష్ణవేణి హాస్టల్‌లో విద్యార్థులకు గొడ్డు కారం పెడుతున్నార‌నే ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

“ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం ఖర్చు రూ.32,000 మాత్రమే. కానీ పేద విద్యార్థులకు గొడ్డు కారం పెడతారు. వారెవ్వా ప్రజాపాలన.. శభాష్ ఇందిరమ్మ రాజ్యం” అని కేటీఆర్‌ తన ట్వీట్‌లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ ఘటనకు సంబంధించి హాస్టల్ విద్యార్థులు సోషల్ మీడియాలో పలు వీడియోలు పోస్టు చేయడంతో ఈ విషయం బహిర్గ‌త‌మైంది. ఆ వీడియోల్లో విద్యార్థినులకు సరైన ఆహారం అందించలేదని, కనీస పోషకాలు లేకుండా గొడ్డు కారం వంటివి అందించారని స్పష్టమైంది.

ప్రతిపక్షాల విమర్శలు
ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాలు కేవలం కాగితాలపై ఉన్నాయని, విద్యార్థుల హక్కులపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆక్షేపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment