సుప్రీం సీజేఐపై దాడి.. కేటీఆర్ పోస్ట్

సుప్రీం సీజేఐపై దాడి.. కేటీఆర్ పోస్ట్

సుప్రీంకోర్టు (Supreme Court)లో సీజేఐ (CJI) బీఆర్ గవాయ్‌ (B. R. Gavai)పై దాడికి  (Attack) యత్నించటాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రజాస్వామ్య మూలాలపై దాడి అంటూ వ్యాఖ్యానించారు. ఇది వ్యక్తిపై దాడి కాదని… వ్యవస్థపైనే దాడి అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.

‘మన దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుంది. దీనికి నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడి జరగడం ఒక దారుణమైన సంకేతం. ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయిపై జరిగిన దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. న్యాయవ్యవస్థ గౌరవంపై జరిగిన ఈ సిగ్గుచేటైన దాడి కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, ఆ వ్యవస్థపైనే జరిగిన దాడి. విశ్వాసం వంటి సున్నితమైన అంశాలపై ఎలాంటి విభేదం ఉన్నా కూడా హింసను సమర్థించదు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యం యొక్క మూలాలకే ముప్పు కలిగిస్తుంది’ అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.

నిన్న సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నల్ల కోటు ధరించిన ఓ లాయర్ ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి పై దాడికి యత్నించారు. ‘సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదంటూ’ ఆ న్యాయవాది నినాదాలు చేశారు. విష్ణుమూర్తి విగ్రహం కేసులో జస్టిస్‌ గవాయ్‌ చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఈ చర్యకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ లాయర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. మూడు గంటల తర్వాత అతడిని విడిచిపెట్టినప్పటికీ, బార్ కౌన్సిల్ అతడి సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment