---Advertisement---

‘అవును.. ప్రభుత్వాన్ని కూల్చమంటున్నారు’ – కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

'అవును.. ప్రభుత్వాన్ని కూల్చమంటున్నారు' - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
---Advertisement---

బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Government) కూల్చాలని చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, అవసరమైతే డబ్బులు (Money) ఇవ్వడానికి కూడా సిద్ధమంటున్నారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) చేసిన వ్యాఖ్యలు నిజమేనంటూ తాను కూడా అదే మాట చెబుతున్నానని తెలిపారు. “ప్రజలే ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు – ఈ ప్రభుత్వాన్ని ఎంతకాలం భరించాలి?” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని కేటీఆర్ అన్నారు.

“మేం ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం లేదు. ప్రజలే చివరికి తీర్పు చెబుతారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఐదేళ్ల గడువు ఉంది. మేము చట్టబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం” అని కేటీఆర్ అన్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని విమర్శించారు.

కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం
కంచగచ్చిబౌలి (Kanchagachibowli) భూములపై (Land) సుప్రీంకోర్టు (Supreme Court) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ “ఈ వ్యవహారంపై సీబీఐ, సీవీసీ, సెబీ, ఆర్బీఐ, ఎస్ఎఫ్ఐవో లాంటి సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలి. కేంద్రం నిజంగా నైతిక విలువలకు కట్టుబడి ఉంటే, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి (Sitting Judge)తో విచారణ జరపాలి” అని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ (PM Modi) ఇప్పటికీ స్పందించకపోతే, ఈ దోపిడీలో బీజేపీకి కూడా పాలుపంచినట్టు అవుతుందని ఆరోపించారు. ఈ నెలాఖరు వరకు వేచి చూస్తామని, చర్యలు తీసుకోకపోతే ప్రజల ముందు బీజేపీ దుశ్చర్యలను బయటపెడతామని తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment