---Advertisement---

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
---Advertisement---

తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలుపై బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జంగ్ సైర‌న్ పేరుతో బీఆర్ఎస్ రైతుల ప‌క్షాన ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. “రాష్ట్రంలోని ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని రుజువు చేస్తే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తాం” అని కేటీఆర్ సవాల్ విసిరారు.

నిజాయితీ ఉంటే చూపించాలి
ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరైన కొండారెడ్డిపల్లెలో లేదా కొడంగల్‌లో వంద శాతం రుణమాఫీ అమలైనట్లు చూపిస్తే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నారు కేటీఆర్‌. రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఖాళీ మాటలేనని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లి ఆరు గ్యారంటీలు అమ‌లు చేశామ‌ని సీఎం రేవంత్ గొప్ప‌లు చెప్పుకుంటున్నాడ‌ని, ఆ వాగ్దానాలు ఎక్క‌డ అమ‌ల‌య్యాయో తెలంగాణ ప్ర‌జ‌లే చెప్పాల‌న్నారు.

రైతు బంధు కింద‌ రూ. 15 వేలు ఇస్తాన‌ని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఏడాది దాటిపోయినా, ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హ‌యాంలో నాట్లు వేసే స‌మ‌యానికి రైతుబంధు డ‌బ్బులు జ‌మ అయ్యేవ‌ని, ఇప్పుడు ఓట్ల‌ప్పుడు ప‌డుతున్నాయన్నారు. వానాకాలం పంట‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రైతుబంధు ఇవ్వ‌లేదని, అందుకే ఇవాళ ధ‌ర్నా చేప‌ట్టామ‌న్నారు. ఇది ప్రారంభం మాత్ర‌మేన‌ని, రాష్ట్ర‌మంతా ధ‌ర్నాలు చేప‌డుతామ‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. రైతుల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం రైతు భ‌రోసా నిధులు 15 వేల చొప్పున ఇవ్వాల‌ని, రైతుభ‌రోసా. ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలని ప్ర‌భుత్వానికి సూచించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment