ఒక్క ఇల్లు చూపిస్తే.. రాజకీయాలకు గుడ్‌బై: రేవంత్‌కు కేటీఆర్ సవాల్

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రాష్ట్ర ప్రభుత్వంపై (Congress Government) తీవ్ర విమర్శలు చేశారు. మూసి నది శుద్ధి, నగరాభివృద్ధి, పేదల ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూసి నదిని శుభ్రపరచడం కోసం తమ ప్రభుత్వం ఉన్న సమయంలో 32 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (Sewage Treatment Plants) ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. మూసిలోకి వచ్చే ప్రతి నీటి చుక్కను శుద్ధి చేయాలన్నదే తమ ఆలోచన అని అన్నారు.

శుద్ధి చేసిన నీటిని నిర్మాణరంగానికి ఉపయోగపడే విధంగా తయారు చేసినట్లు వివరించారు. రెండో దశలో కాలేశ్వరం నీటిని మూసిలో ప్రవహింపజేయాలనే ప్రణాళిక కూడా ఉందని వెల్లడించారు. మూసి సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు కేటీఆర్. అయితే పేదల ఇళ్లను కూల్చకుండా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. మూసి పేరుతో ఎలాంటి అవినీతి జరిగితే బీఆర్ఎస్ అడ్డుకుంటుందని హెచ్చరించారు.

అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయని, కానీ హైదరాబాద్‌లో (Hyderabad) ఒక్క ఇల్లు కూడా (Even a Single House) నిర్మించలేదని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు (Revanth Reddy) కేటీఆర్ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు అయినా నిర్మించినట్లు చూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. పేద ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే రోజుల్లో వారు గట్టిగా స్పందిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల్లో (Budget Sessions) పేదల గొంతుకగా ప్రభుత్వ విధానాలను ఎండగడతామని చెప్పారు. ప్రభుత్వం పాలన చేయలేకపోతే తప్పుకోవాలని, మంచి పాలన ఎలా ఉండాలో తాము చేసి చూపిస్తామని కేటీఆర్ అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment