మహిళల ఫ్రీ బస్ ప్రభావం.. టికెట్ రేట్ల పెంచిన KSRTC

మహిళల ఫ్రీ బస్ ప్రభావం.. టికెట్ రేట్ల పెంచిన KSRTC

కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీ బస్సు టికెట్ రేట్లను 15% మేరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రారంభించిన ఫ్రీ బస్ స్కీమ్ కారణంగా ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు కారణంగా కర్ణాటక ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.417 కోట్ల మేర ఆర్థిక భారం పడుతోంది. ఈ బరువు తగ్గించుకోవడానికి బస్సు ఛార్జీలను పెంచాల్సి వచ్చినట్లు మంత్రి పాటిల్ ప్రకటించారు. కొత్త ఛార్జీలు జనవరి 5 నుండి అమల్లోకి రానున్నాయి.

ప్రజలపై ప్రభావం
బ‌స్ టికెట్ల రేట్ల పెంపుతో ప్రభుత్వానికి నెలకు అదనంగా రూ.8 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ నిర్ణయం కర్ణాటక ప్రజలను ఆర్థికంగా కుదిపేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల ఫ్రీ బస్ ప్రయాణం పథకం కారణంగా టికెట్ ధరలు పెంచడంపై కొందరు విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment