జడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి.. వైఎస్‌ జగన్ సీరియ‌స్‌

కృష్ణా జడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి.. వైఎస్‌ జగన్ సీరియ‌స్‌

గుడివాడ‌ (Gudivada)లో కృష్ణా జిల్లా (Krishna District) జడ్పీ చైర్‌పర్సన్ (Zilla Parishad Chairperson) ఉప్పాల హారిక (Uppala Harika)పై టీడీపీ (TDP) జ‌రిపిన దాడి ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెంచింది. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నెల‌కొన్న వేళ వైసీపీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy తీవ్రంగా స్పందించారు. గుడివాడలో హారిక ప్రయాణిస్తున్న కారు (Car)ను అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన‌ వ్యక్తులు చుట్టుముట్టి, విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ దాడిని టీడీపీ (TDP), జనసేన (Janasena) కార్యకర్తలు (Workers) చేసినట్లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జడ్పీ చైర్‌ప‌ర్స‌న్‌ హారికతో ఫోన్‌లో మాట్లాడిన వైఎస్ జ‌గ‌న్‌, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెను ధైర్యంగా ఉండాలని భ‌రోసా క‌ల్పించారు. అనంత‌రం కూట‌మి ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఈ దాడి ఆటవిక పాలనను తలపిస్తోంది. ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలిపై ఇలాంటి పాశవిక దాడి జరగడం సభ్య సమాజం తలవంచుకునే విషయం” అని జగన్ మండిపడ్డారు. ఈ సంఘటనను రాజకీయ కోణంలో కాకుండా, ప్రజాస్వామ్య (Democracy) విలువలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. రాష్ట్రంలో చట్టం, శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.

వైసీపీ శ్రేణులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” (Red Book Constitution) నడుస్తోందని ఆరోపించాయి. జిల్లా ప్రథమ పౌరురాలికే రక్షణ లేకపోతే, సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. “మహిళలను వేధిస్తే చివరి రోజు అన్న సీఎం చంద్రబాబు (CM Chandrababu), ఆడపిల్లలకు ఏదైనా జరిగితే తాటతీస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ ఘటనపై నోరు విప్పకపోవడం ఎందుకు?” అని వైసీపీ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) ప్రశాంతిరెడ్డి (Prasanthi Reddy) విషయంలో మహిళల గౌరవం గురించి నీతులు చెప్పిన నాయకులు, ఈ దాడిపై మౌనం వహించడం దారుణమని, రాష్ట్రంలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో చట్టవ్యవస్థ, మహిళల భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment