ఓట్ల కోసం దేశాన్ని చీల్చే పార్టీ బీజేపీ.. కోమ‌టిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఓట్ల కోసం దేశాన్ని చీల్చే పార్టీ బీజేపీ.. కోమ‌టిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలో జరుగుతున్న లింగమంతుల స్వామి జాతరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం సెక్యూలర్ విధానాన్ని పాటిస్తుందని, అన్ని మతాలను గౌరవిస్తుందని తెలిపారు. “మాది సెక్యూలర్ ప్రభుత్వం. మాకు అన్ని పండుగలూ సమానమే. ప్రజలందరికీ న్యాయం చేయడమే మా ధ్యేయం” అని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీపై తీవ్ర విమర్శలు
బీజేపీపై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఓట్ల కోసం దేశాన్ని చీల్చే పార్టీ బీజేపీ” అంటూ ధ్వజమెత్తారు. “వాళ్లకు మా గురించి మాట్లాడే అర్హత లేదు” అని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుందని, వచ్చే 20 ఏళ్లపాటు కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు బీజేపీ అసలు రంగును అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇక, దళితుడిని సీఎం చేస్తామని మోసం చేసిన బీఆర్‌ఎస్ పాలనను ప్రజలు ప‌క్క‌కునెట్టేశార‌న్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment