తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి కోలీవుడ్ బ్రదర్స్ రెడీ!

తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి కోలీవుడ్ బ్రదర్స్ రెడీ!

టాలీవుడ్‌ (Tollywood)లో రజనీ (Rajini), కమల్ (Kamal) తర్వాత తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే హీరోలు సూర్య (Suriya) మరియు కార్తీ (Karthi). డబ్బింగ్ సినిమాల ద్వారా ఇక్కడ బలమైన ఇమేజ్, మార్కెట్ సృష్టించుకున్న ఈ బ్రదర్స్, తెలుగు ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమాభిమానానికి ముగ్ధులై, వారి రుణం తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా, ‘బాహుబలి’ ఆఫర్ మిస్ చేసుకున్నందుకు ఫీలైన సూర్య, ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల స్టామినాను గుర్తించి, మంచి అవకాశాల కోసం చూస్తున్నారు. అందులో భాగంగానే, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరితో జతకట్టబోతున్నాడు.

ఇక ఆయన తమ్ముడు కార్తీ విషయానికొస్తే, తెలుగులో అద్భుతంగా మాట్లాడి టాలీవుడ్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యాడు. ఇటీవలే నాని ‘హిట్ 3స‌ లో స్పెషల్ రోల్‌లో మెరిసి, ‘హిట్ 4 కి లీడ్ తీసుకున్న కార్తీ, తన తదుపరి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన సుమారు రూ. 23 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి, తెలుగు ప్రేక్షకులను అలరించడంలో అన్న సూర్య కన్నా కార్తీ ఒక మెట్టు పైనే ఉన్నాడనే చెప్పాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment