ప్రముఖ నటుడు రోబో శంకర్ కన్నుమూత

ప్రముఖ నటుడు రోబో శంకర్ కన్నుమూత

కోలీవుడ్‌ (Kollywood)లో తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు రోబో శంకర్‌ (Robo Shankar) (46) కన్నుమూశారు. గత రెండు రోజులుగా అనారోగ్యం (Illness)తో చెన్నై(Chennai)లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణం తమిళ సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచేసింది.

ప్రారంభంలో రోబోటిక్‌ డ్యాన్సులతో (Robotic Dances) పేరుపొందిన శంకర్‌కి ఆ పేరే ‘రోబో శంకర్’గా స్థిరమైంది. స్టేజ్‌ షోల ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆయన, 1997లో ధర్మ చక్రం సినిమాతో వెండితెరకు అడుగుపెట్టారు. అయితే 2013లో విజయ్‌ సేతుపతి నటించిన ఇధర్కుతానే ఆసైపట్టై బాలకుమారలోని పాత్రతో ఆయన గుర్తింపు పొందారు. ఆ తరువాత ధనుష్‌తో చేసిన చిత్రాలు ఆయనకు మరింత పాపులారిటీని తెచ్చాయి. ఇప్పటివరకు ఆయన సుమారు 80కి పైగా చిత్రాల్లో నటించారు.

ఇటీవల కాలంలో ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలు తగ్గించిన రోబో శంకర్‌, శరీర బరువు ఒక్కసారిగా తగ్గడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఒక సినిమా షూటింగ్‌లో స్పృహతప్పి పడిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యుల ప్రకారం, జీర్ణాశయంలో రక్తస్రావం, అంతర్గత అవయవాల సమస్యలు ఆయన మరణానికి కారణమని తెలిపారు. రోబో శంకర్‌కి భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన భార్య గాయకురాలు, నటి కాగా, కుమార్తె ఇంద్రజ విజయ్‌ బిగిల్ సినిమాలో ‘గుండమ్మ’ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గతేడాది ఆమెకు ఘనంగా వివాహం జరిగిన విషయం తెలిసిందే. రోబో శంకర్‌ మృతితో సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment