భారతదేశంలో ట్రాఫిక్ రద్దీతో విసుగు పుట్టించే నగరాల జాబితాలో కోల్‌కతా మొదటి స్థానంలో నిలిచింది. ఇది ట్రాఫిక్ సమస్యలతో కొట్టుమిట్టాడే బెంగళూరును అధిగమించింది. 2024 టామ్‌ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం, కోల్‌కతాలో 10 కిలోమీటర్ల ప్రయాణానికి 34 నిమిషాలు 33 సెకన్ల సమయం పడుతోందట.
కోల్‌కతా తరువాతి స్థానంలో బెంగళూరు నిలిచింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 10 కిలోమీటర్ల ప్రయాణానికి 34 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుందని ట్రాఫిక్ ఇండెక్స్ తెలిపింది. ఆ తరువాతి స్థానాల్లో పుణే (33m 22s), హైదరాబాద్ (31m 30s), చెన్నై (30m 20s), ముంబై (29m 26s), అహ్మదాబాద్ (29m 3s) ఉన్నాయి. కోల్‌కతా ట్రాఫిక్ టాప్ ర్యాంక్‌లో నిలవడం ట్రాఫిక్ నిర్వహణ పద్ధతులపై మరింత ఆలోచనకు దారి తీస్తోంది.








