---Advertisement---

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు.. నిందితుడికి జీవితఖైదు

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు.. నిందితుడికి జీవితఖైదు
---Advertisement---

గతేడాది ఆగస్టులో జరిగిన కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రి సంఘటన, దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా హత్యాచారం జరిపిన నిందితుడు సంజయ్ రాయ్‌పై కోల్‌కతాలోని సీల్దా కోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. సంజ‌య్ రాయ్‌ని ఈ కేసులో దోషిగా తేల్చిన కోర్టు.. జీవితఖైదుతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్ల‌డించింది.

నేరానికి దారితీసిన సంఘటన
ఆగస్టు 9, 2024న సంజయ్ రాయ్ ట్రైనీ డాక్టర్‌పై అత్యంత కిరాత‌కంగా దాడి చేసి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న జరిగిన వెంటనే పోలీసులు అతడిని ఆగస్టు 10న అరెస్టు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు రేపింది. నవంబరు 12న విచారణ ప్రారంభమై, న్యాయమూర్తి అనిర్బన్ దాస్ జనవరి 18న తీర్పును వెలువరించారు.

కోర్టులో సంజయ్ రాయ్ వాదనలు
సంజయ్ తనపై అన్యాయంగా అభియోగాలు మోపినట్లు కోర్టులో పేర్కొన్నాడు. తనను బలవంతంగా పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని, తాను రుద్రాక్షమాల ధరించే సాధువునని పేర్కొన్నాడు. అయితే, న్యాయమూర్తి ఈ వాదనలను తిరస్కరించి జీవితఖైదు విధించారు.

CBI వాదన
సంజయ్ రాయ్‌కు మరణ శిక్ష విధించాలని సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. భారత న్యాయసంహితలోని సెక్షన్లు 64, 66, 103(1) ప్రకారం అతడిని తీవ్ర నేరాలపై దోషిగా తేల్చింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment