‘లైలా’ సినిమాలో ‘కోయ్ కోయ్’ సాంగ్

'లైలా' సినిమాలో 'కోయ్ కోయ్' సాంగ్

అంచనాలకు తగ్గట్లే జరిగింది! పాస్టర్ గుర్రప్ప పాడిన ‘కోయ్ కోయ్’ సాంగ్ (KoiKoiSong) ఇటీవ‌ల సూప‌ర్ ఫేమ‌స్ అయ్యింది. ఈ పాట‌ను ఏదో ఒక సినిమాలో ఉప‌యోగిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అనుకున్న‌ట్లే జ‌రిగింది. ‘లైలా’ సినిమా (LailaMovie)లో పాస్టర్ గుర్రప్ప (Pastor Gurappa) పాడిన ‘కోయ్ కోయ్’ సాంగ్ భాగమైంది. మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ (VishwakSen) హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో తాజాగా విడుదలైన ‘ఓహో రత్తమ్మా’ పాటలో ఈ లిరిక్స్ వినిపిస్తున్నాయి.

ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ‘కోయ్ కోయ్.. కోడ్ని కోయ్’ అంటూ విశ్వక్‌సేన్ తన స్టైల్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment