టీమిండియా (Team India) సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) మరియు రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి, ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరి భవితవ్యంపై ఇప్పుడు బీసీసీఐ(BCCI) వర్గాల్లోనూ, క్రికెట్ విశ్లేషకుల మధ్యనూ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్ (World Cup) దృష్ట్యా ఈ ఇద్దరు ఆడతారా? లేదా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
వన్డేల్లోనే కొనసాగుతున్న కోహ్లీ-రోహిత్
ఇంగ్లండ్ (England) పై యువ జట్టు చూపించిన ప్రదర్శన మెరిసిపోయింది. రుతురాజ్, జైస్వాల్, రింకూ లాంటి కుర్రాళ్లు ఆకట్టుకున్నారు. ఇక కోహ్లీ, రోహిత్ తదుపరి ఆడే అవకాశం ఈ ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో ఉండే అవకాశం ఉంది. తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, 2026లో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో ఆరు వన్డేలు మాత్రమే షెడ్యూల్‌లో ఉన్నాయి. అంటే, 2027 వరకూ వీరికి మొత్తం 12 వన్డేలు మాత్రమే మిగిలున్నాయి.
“ఒత్తిడి చేయం కానీ, స్పష్టత అవసరం” – బీసీసీఐ వర్గాలు
ఇందుకే కొందరు బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ –
“2027 వరకూ ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటికి రోహిత్‌కు 40, కోహ్లీకి 38 ఏళ్లు. అంత పెద్ద టోర్నీకి ముందే స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. మేం వారిని రిటైర్ అయ్యేయమని ఒత్తిడి చేయం. కానీ శారీరకంగా, మానసికంగా వారు సిద్ధంగా ఉన్నారా అన్నది ప్రొఫెషనల్‌గా మాట్లాడాలి. వారే తమ నిర్ణయం తీసుకోవాలి,” అని పేర్కొంటున్నారు.
హిట్‌మ్యాన్ కల తీరుతుందా?
రోహిత్ శర్మకు వన్డే ప్రపంచకప్ గెలవడం జీవిత కల అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు బృహత్తర ఫార్మాట్లలో విజయం అందని ద్రాక్షగానే మిగిలింది. 2023 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చూపించినా, తుదిలో ట్రోఫీ మాత్రం దక్కలేదు. ఇక 2027లో గెలిచే అవకాశానికి ఇది చివరి అవకాశం కావచ్చు.
కోహ్లీకి ఇదే ఆఖరి మెగా టోర్నీ?
కోహ్లీ ఇప్పటికే 2011 ప్రపంచకప్ విజేత జట్టులో భాగంగా ఉన్నాడు. 2027లోనైనా చివరిసారి మెగా టోర్నీలో ఆడే అవకాశాన్ని అతడు వదులుకుంటాడా? అనే ప్రశ్నలతో ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. కానీ సమయం తక్కువగా ఉండటంతో, ఆటను కొనసాగించాలంటే పూర్తి స్థాయి ప్రణాళిక, ఫిట్‌నెస్, కంటిన్యూస్ ఫామ్ అవసరం అవుతాయి.