---Advertisement---

లాకప్‌లో కోడి.. ఏ త‌ప్పు చేసిందో తెలుసా..?

లాకప్‌లో కోడి.. ఏ త‌ప్పు చేసిందో తెలుసా..?
---Advertisement---

సంక్రాంతి సీజన్‌లో కోడిపందాల ఆట ఆన‌వాయితీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. పందెం రాయుళ్ళు ఈ సమయంలో మరింత చురుకుగా ఉంటారు. కానీ, కోడిపందాలు చట్టవిరుద్ధమని పోలీసులు తేల్చి చెబుతున్నప్పటికీ, దొంగచాటుగా ఇలాంటి కార్యక్రమాలు నిరవధికంగా కొనసాగుతూనే ఉన్నాయి.

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరు మండలం దుగనపల్లె గ్రామంలో తాజాగా జరిగిన ఓ ఆసక్తికర ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. పేకాట‌, కోడి పందాలు నిర్వహిస్తున్నార‌న్న సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు.

పాపం.. కోడికి శిక్ష ఎందుకు?
పోలీసులు కోడి పందాలు, పేకాట స్థావ‌రాల‌పై దాడి చేసి ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద కొంత న‌గ‌దు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అనంత‌రం వారికి నోటీసులు ఇచ్చి పంపించేశారు. వారితో పాటు స్టేష‌న్‌కు తీసుకువ‌చ్చిన కోడి పుంజును మాత్రం లాకప్‌లోనే ఉంచారు.

దీనిపై చెన్నూరు పోలీసులు స్పందిస్తూ.. కోడిని న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి తీర్పు వచ్చే వరకు లాకప్‌లో ఉంచుతామ‌న్నారు. ఆ కోడిపుంజు నేరం ఏమిటో తెలియక చీకటిలో కూరుకుపోయింది. పాపం.. తొడ కొట్టడం తప్ప ఏమీ చేయలేదు గానీ, కోడి ఖైదీ అయింది!” అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment