ఇండియన్ క్రికెట్ స్టార్ KL రాహుల్ తండ్రి అయ్యారు. ఆయన భార్య అతియాశెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భం రాహుల్ కుటుంబం సంబరాలు జరుపుకుంటోంది. కాగా, IPL 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్, తన భార్య డెలివరీ సమయం కావడంతో మొదటి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. అభిమానులు, క్రికెట్ ప్రపంచం మొత్తం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని కేఎల్ రాహుల్ ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరిద్దరి లవ్ స్టోరీ 2019లోనే మొదలైంది. కొన్నేళ్లపాటు డేటింగ్‌లో కొనసాగిన ఈ జంట 2023లో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి వైవాహిక బంధానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని స్వయంగా అతియా శెట్టి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.