గతేడాది “క” సినిమాతో తన కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ ఏడాది దీపావళి కానుకగా, మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అయిన ‘K RAMP’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీపావళికి పోటీగా మరో మూడు సినిమాలు విడుదలైనా, ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో సాలిడ్ హిట్‌ను నమోదు చేసింది.
కిరణ్ అబ్బవరం కెరీర్‌లో 11వ సినిమాగా వచ్చిన ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహించారు, మలయాళ బ్యూటీ యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది.
హాస్య మూవీస్ బ్యానర్‌లో ఏడవ సినిమాగా వచ్చిన ‘K RAMP’, తొలిరోజున ₹4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో మంచి ఆరంభాన్ని అందుకుంది. మొదటి రోజును మించి, రెండవ రోజు మరింత ఎక్కువ వసూలు చేసి, ప్రపంచవ్యాప్తంగా ₹11.3 కోట్లు కొల్లగొట్టింది. దీపావళి వీకెండ్ కావడంతో, చాలా సెంటర్లలో ఈ చిత్రం హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టింది.
విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే, ఈ చిత్రం ₹17.5 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ మార్క్‌ను అధిగమించి సంచలనం సృష్టించింది. నేటి (మంగళవారం) నుండి ఈ సినిమా అన్ని ఏరియాలలో లాభాల జోన్‌లోకి (Profit Zone) ప్రవేశించింది. హీరో కిరణ్ అబ్బవరం, నిర్మాత రాజేష్ దండా ముందు నుండి చెప్పినట్టు, ప్రేక్షకులను కేవలం వినోదం కోసమే రమ్మని చెప్పి, ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యారు.








